మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టంగా అనిపించిందా? ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ సులభంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు!EnglishGrammarTelugu అనే మా బ్లాగ్ మీలాంటి వారికోసమే స్టార్ట్ చేశాం, ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభంగా, ఆసక్తికరంగా ఉండాలని.
ఈ బ్లాగ్ లక్ష్యం ఏంటి?
మనలో చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు, ఎందుకంటే మనం ఇతరులతో బాగా కమ్యూనికేట్ చేసేందుకు సహాయం చేస్తుంది, కెరీర్‌లో కూడా మంచి అవకాశాలు తెస్తుంది. అయితే, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కాస్త కష్టమైన పని అయినప్పటికీ , అసాధ్యం అయితే కాదు ముఖ్యంగా తెలుగు వారికీ. అందుకే మేము ఈ బ్లాగ్ ద్వారా మీకు ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్స్ నుండి అడ్వాన్సుడ్ టాపిక్స్ , స్పోకెన్ ఇంగ్లిష్ ,వొకాబులరీ అన్ని సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగులో అందించాలనుకుంటున్నాం.
మా బ్లాగ్ ఎందుకు ?
ఈజీ గ్రామర్ లెసన్స్ :ఇంగ్లీష్ లో ఎటువంటి గందరగోళం లేకుండా సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు.
స్పోకెన్ ఇంగ్లీష్ టిప్స్: మీరు డైలీ లైఫ్ లో యూస్ చేసే సెంటెన్స్ ,వర్డ్స్ మీకు సులభంగా వివరించడం జరుగుతుంది
ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్: ఒక్కో విషయం అర్థం చేసుకోవడం కంటే, దాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యమని మేము నమ్ముతున్నాం. అందుకే ప్రాక్టికల్ ఉదాహరణలతో మీకు హెల్ప్ చేస్తాం.
మా ప్రయాణం…
మేము కూడా మీలాంటి వాళ్లమే, ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదట్లో కాస్త కష్టంగా అనిపించింది. అనేక పుస్తకాలు చదవడం, వీడియోలు చూడడం, చివరికి ప్రాక్టీస్ చేయడం ద్వారా మేము సులభమైన మార్గాలు కనుగొన్నాం. ఆ అనుభవం తోడుగానే మీకు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం చేసే ప్రయత్నం చేస్తున్నాం.
మీ ప్రయాణంలో మీతో…
మీరు మాలాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఈ లెర్నింగ్ లో మీకు హెల్ప్ చేసేందుకు మేము రెడీ . ఏదైనా సందేహం వస్తే, లేదా ఎక్కడైనా సమస్య ఎదురైతే, ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఈ బ్లాగ్ ద్వారా మీరు ఒక అడుగు ముందుకు వేసి, ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం సాధించండి. మనం కలిసి ఈ ప్రయాణాన్ని ఆసక్తికరంగా, సరదాగా ముందుకు తీసుకెళ్దాం!
Englishgrammartelugu Team