Types of Nouns in English Grammar in Telugu
ఇంగ్లీష్ వ్యాకరణంలో (Types of English Nouns in Telugu) నామవాచకాలు పలు రకాలుగా విభజించబడతాయి. ప్రతి రకానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల నామవాచకాలు(Types of Nouns ) మరియు వాటి ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము :
Proper Nouns (వ్యక్తినామాలు)
నిర్దిష్ట వ్యక్తులు, ప్రదేశాలు లేదా వస్తువులకు పేర్లు సూచించే పదాలు. వీటి మొదటి అక్షరం ఎప్పుడూ పెద్ద అక్షరంగా ఉంటుంది.
ఉదాహరణలు: John, London, Ganga, Amazon
Common Nouns (సామాన్య నామాలు)
– సాధారణంగా వ్యక్తులు, ప్రాణులు, వస్తువులు లేదా ప్రదేశాల గురించి సూచించే పదాలు. ఇవి నిర్దిష్టంగా ఉండవు.
-ఉదాహరణలు: teacher, city, river, book
Collective Nouns (సమూహ నామాలు)
– ఒక సమూహాన్ని లేదా గుంపును సూచించే పదాలు, ఒకే ఒక్క నామవాచకం ద్వారా ఒక సమూహాన్ని సూచిస్తాయి.
ఉదాహరణలు: team, family, crowd, flock
Abstract Nouns (భావ నామాలు)
భావాలు, లక్షణాలు లేదా మనసుకు సంబంధించిన భావాలను సూచించే పదాలు. ఇవి మనం చూడలేము కానీ మనసుకు అనుభవంలోకి తీసుకొనొచ్చు.
ఉదాహరణలు:happiness, freedom, love, courage
Concrete Nouns (వాస్తవ నామాలు)
మనం చూడగలిగే లేదా తాకగలిగే పదార్థాలను సూచించే పదాలు.
-ఉదాహరణలు: apple, dog, house, computer
Countable Nouns (లెక్కించగలిగే నామాలు)
– ఏవైనా సంఖ్యలో లెక్కించగలిగే నామవాచకాలు.
-ఉదాహరణలు: car, book, apple (We can say one car, two books)
Uncountable Nouns (లెక్కించలేని నామాలు)
– లెక్కించలేని పదార్థాలు లేదా భావాలను సూచించే నామవాచకాలు.
ఉదాహరణలు: water, rice, milk, air
Material Nouns (పదార్థ నామాలు)
– ఒక పదార్థం లేదా ఉపాధికి చెందిన పదాలు, ఇది మరి ఇతర వస్తువులను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
– ఉదాహరణలు: gold, wood, water, iron
Compound Nouns (సంయుక్త నామాలు)
రెండు లేదా మూడు పదాలు కలిసి ఒక నూతన పదంగా వ్యవహరించే పదాలు.
ఉదాహరణలు: toothbrush, sunlight, bedroom